మచ్చ బొల్లారం: ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ మిలాదున్ నబీ వేడుకలను మచ్చ బొల్లారం దర్గా, హజ్రత్ సయ్యద్ సాదాత్ (రహ్మతుల్లా అలైహ్) వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పవిత్ర ఆసారే ముబారక్‌ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వేడుకల్లో భాగంగా భక్తుల కోసం ప్రత్యేకంగా ఆసారే ముబారక్ జియారత్ నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ వేడుకలను సయ్యద్ అతిక్ పాషా పర్యవేక్షిస్తూ నేతృత్వం వహించారు. కార్యక్రమంలో సయ్యద్ తౌఫీక్ బాబా, సయ్యద్ కౌసర్ పాషా భాయ్, సయ్యద్ షఫీక్, సయ్యద్ ఆతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా దర్గా పరిసరాల్లో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


