శుక్రవారం, 02 అక్టోబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
02-10-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణరాజీవ్ గృహ కల్ప, కౌకూర్‌లో ఘనంగా రాఖీ పండుగ
తెలంగాణతాజా కథనం

రాజీవ్ గృహ కల్ప, కౌకూర్‌లో ఘనంగా రాఖీ పండుగ

రాజీవ్ గృహ కల్ప, కౌకూర్‌లో ఘనంగా రాఖీ పండుగ
సోదరభావానికి ప్రతీకగా తూడిమెళ్ళ మల్లికార్జున్‌కు రాఖీలు కట్టిన మహిళలు
ఎన్. నాజరేయుడూ
ఎన్. నాజరేయుడూ
రిపోర్టర్
2026-08-28
4 నిమిషాల పఠనం
22 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
రాజీవ్ గృహ కల్ప, కౌకూర్‌లో ఘనంగా రాఖీ పండుగ

రాజీవ్ గృహ కల్ప, కౌకూర్‌లో ఘనంగా రాఖీ పండుగ

కౌకూర్: మల్కాజిగిరి నియోజకవర్గం యాప్రాల్ డివిజన్ కౌకూర్‌లోని రాజీవ్ గృహ కల్ప కాలనీలో రాఖీ పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య, భావోద్వేగభరితంగా జరిగాయి. కాలనీకి చెందిన అక్కచెల్లెళ్లు, తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సోదరుడు తూడిమెళ్ళ మల్లికార్జున్‌కు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని, అది జన్మజన్మల అనుబంధానికి ప్రతీక అని అన్నారు. రాజీవ్ గృహ కల్ప కాలనీతో తనకున్న అనుబంధం ఎన్నో సంవత్సరాల నాటిదని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో గత ఎన్నో ఏళ్లుగా కాలనీ ప్రజలు తనకు అండగా నిలిచారని, రాఖీ ద్వారా తనపై వారు చూపించిన ప్రేమ, నమ్మకాన్ని ఎప్పటికీ మరువబోనని అన్నారు.
కాలనీ మహిళల రక్షణతో పాటు కాలనీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మల్లికార్జున్ తెలిపారు. వారి సోదరుడిగా, బిడ్డగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అక్కచెల్లెళ్లు మాట్లాడుతూ మల్లికార్జున్ తమకు కేవలం నాయకుడు మాత్రమే కాదని, తమ కుటుంబ సభ్యుడని అన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్నలా ఆదుకుంటూ తమకు అండగా నిలుస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహ కల్ప కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి