మేడ్చల్–మల్కాజిగిరి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజాసేవలో మరింతగా రాణించాలని నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, దూలపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి శివకుమార్ గౌడ్, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్ యాదవ్, బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు లత, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



