సూరారం: రాఖీ పండుగ సందర్భంగా సూరారం డివిజన్లో సోదరభావం, ఆత్మీయత వెల్లివిరిసింది. డివిజన్‌కు చెందిన మహిళలు, ముస్లిం మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో CMC డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు.
మహిళలు పుప్పాల భాస్కర్‌ను తమ సోదరుడిగా భావిస్తూ రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మతాలకు అతీతంగా సోదరభావం, పరస్పర గౌరవం, ఆత్మీయతను చాటిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ మహిళలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకం ఎంతో విలువైనవని అన్నారు. మహిళలతో తనకున్న ఆత్మీయ అనుబంధానికి ఈ రాఖీ పండుగ కార్యక్రమం నిదర్శనమని తెలిపారు. మహిళల గౌరవం, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తూ అండగా ఉంటానని పేర్కొన్నారు.
రాఖీలు కట్టిన మహిళలకు పుప్పాల భాస్కర్ కుటుంబ సభ్యులు చీరలను బహుకరించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్ల గౌరవం, ఆత్మీయతకు ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి, లావణ్య, షైనాజ్, సుభద్ర, అర్షియ, ధనలక్ష్మి, భాగ్యతో పాటు సూరారం డివిజన్‌కు చెందిన పలువురు మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




