హైదరాబాద్: రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన మహిళా సోదరీమణులు ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను ఆయన నివాసంలో, పికెట్‌లోని క్యాంపు కార్యాలయంలో కలిసి రాఖీలు కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. రక్షా బంధన్ అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మహిళా సోదరీమణులు తనపై చూపించిన ప్రేమాభిమానాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయని తెలిపారు.
మహిళల భద్రత, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తనకు రాఖీలు కట్టిన మహిళా సోదరీమణులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో పాటు మహిళా సోదరీమణులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




