తెలకపల్లి: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బల్మూరు మండలం తుమ్మెన్పేట గ్రామానికి చెందిన మల్లేష్ కొంతకాలంగా తెలకపల్లి మండల పరిసర గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డుదారుల నుంచి కిలో బియ్యాన్ని రూ.18 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి, అధిక ధరలకు నల్లబజారులో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఏ. హేమ్లా నాయక్, తెలకపల్లి పోలీసుల సమక్షంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టీజీ 08టీ 5172 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు.
వాహనంలో 60 గన్నీ బస్తాల్లో సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పంచనామా నిర్వహించిన అనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ ఏ. హేమ్లా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

