నాగర్కర్నూల్: రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూల్ మాజీ శాసనసభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి ఆయన సోదరి శ్రీమతి ఇందిర గారు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అనంతరం మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యత ఉందని, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి నిదర్శనమని అన్నారు. రాఖీ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
రాఖీ పౌర్ణమి శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నాగర్కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


