కాఠ్మాండు: ప్రాణాంతక ఆకస్మిక వరదలతో నేపాల్ విద్యుత్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సుమారు 8 శాతం దెబ్బతినడంతో విద్యుత్ కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అవసరమైతే భారత్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందని నేపాల్ ఇంధన శాఖ వెల్లడించింది.
హిమనదం కూలిపోవడంతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా సుమారు 360 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం జలవిద్యుత్ ప్రాజెక్టులే ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో లోటు ఏర్పడితే భారత్ నుంచి విద్యుత్ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు నేపాల్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


