అమరావతి: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ’ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొని బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణకు ‘ఏపీ గ్రీన్’ సొసైటీ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ఈ పదవి కీలకంగా నిలవనుంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


