పాలెం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పాలెం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ముందస్తు రక్షా బంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు రాఖీలు కట్టించి రక్షా బంధన్ పండుగ విశిష్టతను వివరించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, రక్షా బంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య రాఖీ కట్టుకునే పండుగ మాత్రమే కాదని, సమాజంలో పరస్పర రక్షణ, సోదరభావం, ఐక్యతను పెంపొందించే గొప్ప సంస్కారమని అన్నారు.
“నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమంతా మన దేశానికి రక్ష” అనే భావన ప్రతి విద్యార్థిలో ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా విద్యార్థులు ఐక్యంగా ఉంటూ సమాజం, దేశం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
దేశ భద్రత, సమాజ శ్రేయస్సు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థి దశ నుంచే సేవాభావం, దేశభక్తి, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజినాపల్లి మండల కన్వీనర్ జీవన్ యాదవ్, పాలెం టౌన్ సెక్రటరీ విష్ణు నాయుడు, ఆకాష్, జహంగీర్, వెంకటేష్, విష్ణు, వంశీ, చందు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



