బిజినపల్లి, ఆగస్టు 27: పాములు అంటే భయపడకుండా వాటి ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో సర్పాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ సర్ప సంరక్షకుడు, వృక్షశాస్త్రవేత్త డా. బి. సదాశివయ్య తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని ఆల్ సెయింట్స్ మోడల్ స్కూల్లో పాములపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. బి. సదాశివయ్య విద్యార్థులకు పాముల జీవన విధానం, పర్యావరణంలో వాటి ప్రాధాన్యత, సర్ప సంరక్షణపై అవగాహన కల్పించారు. పాములు ఎలుకల సంఖ్యను నియంత్రించడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, ఆహారపు గొలుసులో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. భారతీయ సంస్కృతిలో నాగారాధనకు ఉన్న ప్రత్యేకతను కూడా వివరించారు.
విషపూరిత, విషరహిత సర్పాలను గుర్తించే విధానం, పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స చర్యలు, మూఢనమ్మకాలను నమ్మకుండా బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాములను చంపకుండా సంరక్షించాలని సూచించారు.
డా. సదాశివయ్య మాట్లాడుతూ.. పాములు మన శత్రువులు కావని, ప్రకృతి సమతుల్యతను కాపాడే మానవ నేస్తాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తించి, సర్పాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం సభ్యులు జోసెఫ్, రీతూ, డా. సదాశివయ్య పూర్వ విద్యార్థి తిరుపతయ్య, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సీతా అశోక మొక్కలను బహుమతిగా అందజేశారు., ఆగస్టు 27: పాములు అంటే భయపడకుండా వాటి ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో సర్పాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ సర్ప సంరక్షకుడు, వృక్షశాస్త్రవేత్త డా. బి. సదాశివయ్య తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని ఆల్ సెయింట్స్ మోడల్ స్కూల్లో పాములపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డా. బి. సదాశివయ్య విద్యార్థులకు పాముల జీవన విధానం, పర్యావరణంలో వాటి ప్రాధాన్యత, సర్ప సంరక్షణపై అవగాహన కల్పించారు. పాములు ఎలుకల సంఖ్యను నియంత్రించడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, ఆహారపు గొలుసులో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. భారతీయ సంస్కృతిలో నాగారాధనకు ఉన్న ప్రత్యేకతను కూడా వివరించారు.
విషపూరిత, విషరహిత సర్పాలను గుర్తించే విధానం, పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స చర్యలు, మూఢనమ్మకాలను నమ్మకుండా బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాములను చంపకుండా సంరక్షించాలని సూచించారు.
డా. సదాశివయ్య మాట్లాడుతూ.. పాములు మన శత్రువులు కావని, ప్రకృతి సమతుల్యతను కాపాడే మానవ నేస్తాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తించి, సర్పాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం సభ్యులు జోసెఫ్, రీతూ, డా. సదాశివయ్య పూర్వ విద్యార్థి తిరుపతయ్య, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సీతా అశోక మొక్కలను బహుమతిగా అందజేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):