ఉయ్యాలవాడ, ఆగస్టు 27: ఎంపీ యూపీఎస్ ఉయ్యాలవాడ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాఖీలు కట్టుకుని అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.
రాఖీ పౌర్ణమి సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ అని ఉపాధ్యాయులు తెలిపారు. చారిత్రక కథనాలను గుర్తుచేస్తూ, అలెగ్జాండర్ భార్య రుక్సానా భారత రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టినట్లు పేర్కొన్నారు.
“నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనిద్దరం కలిసి దేశాన్ని రక్షిద్దాం” అనే సందేశంతో విద్యార్థుల్లో దేశభక్తి, సోదరభావం, పరస్పర రక్షణ భావనలను పెంపొందించేలా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజన్న, ఉపాధ్యాయులు వి. వెంకట రాములు, శ్రీమతి నికిత, స్వర్ణలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




