కంటోన్మెంట్: మానవాళికి ప్రేమ, కరుణ, త్యాగం అనే గొప్ప సందేశాన్ని అందించిన భారతరత్న మదర్ థెరిస్సా సేవలు చిరస్మరణీయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్లో ఉన్న మదర్ థెరిస్సా విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మదర్ థెరిస్సా తన జీవితాన్ని పేదలు, నిరుపేదలు, అనాథలు, నిరాశ్రయుల సేవకు అంకితం చేశారని గుర్తుచేశారు. ఆమె చూపిన ప్రేమ, కరుణ, సేవా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు.
ప్రతి ఒక్కరూ మదర్ థెరిస్సా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని పేదలు, నిరుపేదలకు అండగా నిలవాలని, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొని మదర్ థెరిస్సాకు నివాళులర్పించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


