జగద్గిరిగుట్ట: కుత్బుల్లాపూర్ డీసీపీ, కుత్బుల్లాపూర్ ఏసీపీతో కలిసి జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు నిర్వాహకులు, ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై ఊరేగింపుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు.
ఊరేగింపు నిర్వహించనున్న మార్గం, బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలపై పోలీసు అధికారులు నిర్వాహకులతో సమీక్షించారు. అనంతరం ఊరేగింపు జరగనున్న మార్గాన్ని స్వయంగా పరిశీలించారు.
ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు జారీ చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



