నాగర్‌కర్నూల్, ఆగస్టు 26: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 ఏళ్ల చెంచు బాలుడు గణేష్‌కు అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరం కావడంతో, రాత్రి 11 గంటల సమయంలో యూత్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ రక్తదాతల కోసం అత్యవసర విజ్ఞప్తి చేశారు.
ఈ పిలుపుకు వెంటనే స్పందించిన గట్టు నెల్లికుదురు డిప్యూటీ సర్పంచ్ బాలస్వామి, వైద్య ఆరోగ్య శాఖలో లెప్రసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుకుమార్ రాత్రివేళలోనూ ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేసి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.
ఒక చెంచు బాలుడి ప్రాణరక్షణ కోసం అత్యవసర సమయంలో ముందుకు వచ్చి సహకరించిన బాలస్వామి, సుకుమార్లను పలువురు అభినందించారు. వారి మానవతా దృక్పథం, సేవా భావం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
యూత్ రెడ్ క్రాస్ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సి. రమేష్ రెడ్డి, జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ బాలస్వామి, సుకుమార్‌ల సేవా స్ఫూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
అత్యవసర సమయంలో స్పందించి ఓ బాలుడి ప్రాణరక్షణకు సహకరించిన వారి సేవకు యూత్ రెడ్ క్రాస్ సొసైటీ, నాగర్‌కర్నూల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


