మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా, అంతాయిపల్లి:
అంతాయిపల్లిలోని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) బ్యాంకర్ల సమావేశానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.
జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో LDM సి. శివప్రసాద్, ఆర్బీఐ ఏజీఎం హేమలత, నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ ఝాన్సీ రాణితో పాటు వివిధ బ్యాంకుల అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకులు మరింత సహకారం అందించాలని కోరారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలను సకాలంలో మంజూరు చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లకు సూచించారు. జీరో అకౌంట్ ద్వారా రుణాలు మంజూరు చేసే సందర్భంలో ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేశారు.
బ్యాంకుల వద్ద లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, రుణ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అన్ని బలహీన వర్గాలకు వివిధ రుణ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.
ముద్ర, పీఎం విశ్వకర్మ, PMEGP, PMFME, MSME, RAMP వంటి పథకాల ద్వారా యువత, మహిళలు, స్వయం ఉపాధిదారులకు రుణాలు అందేలా బ్యాంకర్లు చొరవ చూపాలని ఎమ్మెల్యే కోరారు. మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రుణాలపై లబ్ధిదారులకు ఉన్న సందేహాలను నేరుగా సంప్రదించి నివృత్తి చేయాలని సూచించారు.
బ్యాంకింగ్ సేవల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ప్రశ్నించగా, సమస్యలపై పూర్తి వివరాలను త్వరలో అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం, బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



