బిజినపల్లి, ఆగస్టు 25: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉపనమోని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో గంగారం గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో గంగారం సర్పంచ్ ఉపనమోని లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ శారద, శంకర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గట్టు బొందయ్య, బిజినపల్లి శేఖర్ రెడ్డి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అధ్యక్షులు లక్ష్మణ్, జర్నలిస్టు వెంకటస్వామి, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


