పాలెం: గ్రామంలో చేపట్టనున్న భూ సర్వేలకు సంబంధించి మంగళవారం (25-08-2026) పాలెం రైతు వేదికలో అత్యవసర గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఉప సర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, ఎమ్మార్వో మునిరుద్దీన్, ఏఈఓ, వీఆర్వోలు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టనున్న భూ సర్వే ప్రక్రియపై అధికారులు రైతులు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సర్వే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూములకు సంబంధించిన వివరాలు, సమస్యలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురావడం వంటి అంశాలను వివరించారు.
భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు, రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా భూ సర్వేకు సంబంధించిన పలు అంశాలపై రైతులు అధికారులతో చర్చించారు.
కార్యక్రమంలో సర్వేయర్ రాఘవేందర్, గ్రామ కార్యదర్శి శివకృష్ణ, జీపీ ఓ మంజుల, గ్రామ ప్రజలు, రైతులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


