బిజినపల్లి : బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాలెం గ్రామంలోని ఏబీసీ హాస్టల్ ఆవరణలో గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉప సర్పంచ్ గోవిందు శ్రీనివాసులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాటిన మొక్కలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ సంరక్షిస్తే అవి భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా మారుతాయని తెలిపారు.
వనమహోత్సవ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హాస్టల్ ఆవరణలో మొక్కలు పెంచడం వల్ల విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శివకృష్ణ, హాస్టల్ వార్డెన్లు సుధాకర్, యాదయ్య, జయశంకర్, కరెంట్ లైన్మెన్ సత్యనారాయణ, జూనియర్ లైన్మెన్ రాఘవేందర్, హాస్టల్ ఫీల్డ్ అసిస్టెంట్ అభేదా, హాస్టల్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో భాగంగా హాస్టల్ ఆవరణలో పలు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సిబ్బంది, గ్రామస్తులకు సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


