వనపర్తి జిల్లా, ఆగస్టు 24: వనపర్తి జిల్లా కర్నేతండాలో ఎత్తిపోతల పథకాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మేఘా రెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రావడంతో కర్నేతండా, పరిసర ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఈ పథకం మరింత ఊతమివ్వడంతో పాటు, స్థానికంగా అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గి, వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అన్నారు. కర్నేతండా పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఈ ఎత్తిపోతల పథకం కీలకంగా మారుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


