నాగర్‌కర్నూల్: బిజినపల్లి గ్రామ శివారులోని జుట్టయ్య కుంట కట్ట తెగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే కట్టను పునర్నిర్మించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
రైతుల వివరాల ప్రకారం.. జుట్టయ్య కుంటకు సుమారు 458 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కుంట కట్ట గత 18-03-2026న తెగిపోవడంతో నీటి నిల్వకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. దీంతో కుంటపై ఆధారపడిన రైతుల పంట పొలాలకు నీటి సమస్య ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు 39.05 మీటర్ల పొడవు, 0.5 మీటర్ల వెడల్పు, 1 మీటర్ ఎత్తు మేర కట్ట దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కట్టను సుమారు 20×15×1 మీటర్ల మేర పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని వినతిపత్రంలో వివరించారు.
కట్ట పునర్నిర్మాణం కోసం గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. తక్షణమే నిధులు మంజూరు చేసి కట్టను పునర్నిర్మించి, కుంటపై ఆధారపడిన రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ సందర్భంగా రైతులు టి. అల్లయ్య, కె. సుదర్శన్, ఎన్. మహేందర్ తదితరులు పాల్గొని వినతిపత్రాన్ని అందజేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




