బిజినపల్లి: మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మెల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం రెండో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వేదమూర్తులైన బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కొరవి రామానుజాచార్యులు తెలిపారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 36 మంది దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహం పొందవచ్చని భక్తులకు తెలిపారు. భక్తుల కోరిక మేరకు ఆలయంలో ప్రతిరోజూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వ్రతాలు, కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ బాలాజీ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. గోపాల్, శేఖర్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్య, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



