తెలకపల్లి: మండలంలోని కర్వాంగ గ్రామానికి చెందిన జుట్క నరేష్ (19) అదృశ్యమైన ఘటనపై తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నరేష్ నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 18న కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు.
అనంతరం స్నానం చేసి, తన తల్లి లక్ష్మమ్మకు తిరిగి హాస్టల్‌కు వెళ్తున్నట్లు చెప్పి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే హాస్టల్‌కు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా నరేష్ ఆచూకీ లభించలేదు.
దీంతో నరేష్ తండ్రి పెద్ద కురుమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలకపల్లి పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

