బిజినపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో వెలసిన కేతురబండ ఆంజనేయస్వామి దేవస్థానంలో శ్రావణ మాసం రెండో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో వరద పాయసం పోశారు.
సకల వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు చక్కగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని, గంగారం గ్రామ ప్రజలను అంజన్న చల్లగా చూడాలని భక్తులు స్వామివారిని వేడుకున్నారు. అనంతరం భజన బృందం సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ ప్రజలు, భజన బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


