బిజినపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కర్రెమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలు, భక్తులు బోనాలతో ఊరేగింపుగా కర్రెమ్మతల్లి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కర్రెమ్మతల్లికి నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
తమ గ్రామాన్ని సుఖశాంతులతో, సకాలంలో వర్షాలతో చల్లగా చూడాలని కర్రెమ్మతల్లిని భక్తులు వేడుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు, ఉపసర్పంచ్ మహేష్, మిద్దె సూరి, గ్రామ వార్డు సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


