పాలెం: పాలెం గ్రామంలో కర్రేమ్మ బోనాల పండుగను గ్రామ ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో కర్రేమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు.
అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించారు. భక్తులు కర్రేమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
పండుగ సందర్భంగా గ్రామంలోని వీధులు, ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. మహిళలు భక్తిగీతాలు ఆలపిస్తూ అమ్మవారిని స్మరించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బోనాల వేడుకలతో పాలెం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. కర్రేమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా బోనాల పండుగను నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ, ఉప సర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, అడ్వకేట్ రాంచందర్, రవీందర్ రెడ్డి, దశరథం, రాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


