బిజినపల్లి మండలంలో పగటి వేళ ఇంటి దొంగతనం ఘటన చోటుచేసుకుంది. ముచ్చర్ల గ్రామానికి చెందిన సయ్యద్ రజియా బేగం (55) ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కనక శివకుమార్ (23)ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలి ఇంటి పరిసరాల్లో సంచరిస్తూ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించాడు. గతంలో బాధితురాలి కుటుంబ సభ్యులతో పరిచయం ఉన్న నిందితుడు, ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించి చోరీకి పాల్పడ్డాడు. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు, నగదును అపహరించినట్లు దర్యాప్తులో తేలింది.
చోరీ చేసిన ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి చోరీకి సంబంధించిన సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బిజినపల్లి పోలీస్ స్టేషన్లో Cr.No.211/2026గా కేసు నమోదు చేశారు. నిందితుడిపై BNS సెక్షన్లు 331(4), 305 కింద కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


