అచ్చంపేట: ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిని వెంటనే అరికట్టాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అచ్చంపేట శాఖ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం అచ్చంపేట మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) శ్రీనివాస్ మూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు విశ్రాంతి లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్న చోట విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం నిర్దేశించిన విద్యా క్యాలెండర్ను ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులపై అధిక విద్యా ఒత్తిడి పడకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భాను ప్రసాద్, జస్వంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

