నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు భూషయ్య ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భూషయ్య మాట్లాడుతూ.. ఆగస్టు 23, 2026న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాల మహా సమావేశాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలో సమతా, మమత, భ్రాతృత్వాన్ని ప్రబోధించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త సంత్ గురు రవిదాస్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నాగర్‌కర్నూల్ జిల్లా నలుమూలల నుంచి దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆగస్టు 23న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు, దళిత మోర్చా జిల్లా నాయకులు రేణయ్య, శంకర్, రాముతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


