నాగర్కర్నూల్: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో భారీ ధర్నా నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రి ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమానికి రెండువేలకు పైగా మహిళలు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రూ.1,00,116తో పాటు ఒక తులం బంగారం కూడా అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు.
హామీ ఇచ్చిన విధంగా పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఆడబిడ్డల వివాహాలకు అందుతున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం సరికాదని, గతంలో అందించిన విధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకం ప్రయోజనాలు అందించాలని మర్రి జనార్దన్ రెడ్డి కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


