బిజినపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో మంగళవారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ గుడికి చేరుకున్నారు. అనంతరం పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి, కోడిపుంజులతో మొక్కులు తీర్చుకున్నారు.
‘‘మా గ్రామాన్ని చల్లగా చూడు తల్లి’’ అంటూ పోచమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు, ఉపసర్పంచ్ మహేష్, మిద్దె సూరి, పర్వతాలు యాదవ్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


