బిజినపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం శాయినిపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొంగరి శంకర్ ఆధ్వర్యంలో గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి, ‘‘మా ఊరిని చల్లగా చూడు తల్లి’’ అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సర్పంచ్ కొంగరి శంకర్, బుచ్చిరెడ్డి, అడ్వకేట్ తిరుపతయ్య, కొండయ్యతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


