బిజినపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహాదేవునిపేట గ్రామంలో బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లికి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. అనంతరం కోడిపుంజులతో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామాన్ని సుఖసంతోషాలతో చల్లగా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడ్ల నర్వ ఆంజనేయులు, ఉపసర్పంచ్ కిరణ్, మాజీ ఎంపీటీసీ తిరుపతిరెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


