అచ్చంపేట: కల్యాణలక్ష్మీ–షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట టౌన్లో మహా ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ ధర్నాకు అచ్చంపేట, బల్మూర్తో పాటు పరిసర మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మీ–షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టినట్లు తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ భీమా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోకల మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్, మాజీ చైర్మన్ తులసీరాం, మైనార్టీ నాయకులు అమీన్ఉద్దీన్, బల్మూర్ మండల మాజీ ఎంపీపీ కర్ణాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వీరితో పాటు అచ్చంపేట టౌన్, పరిసర మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణలక్ష్మీ–షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించి పేద కుటుంబాలకు న్యాయం చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

