తెలకపల్లి: మండల పరిధిలోని గట్టురాయిపాకుల గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు చల్ల సుబ్బయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం జిల్లా బృందం సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది.
ఈ సందర్భంగా వర్ధం పర్వతాలు మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని ఆశతో సుబ్బయ్య తనకున్న ఐదు ఎకరాల పొలంతో పాటు మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసం హార్వెస్టర్, ట్రాక్టర్ తదితరాలను తీసుకోవడంతో అప్పులు సుమారు రూ.30 లక్షలకు చేరాయని చెప్పారు. అప్పుల భారాన్ని భరించలేక సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ వెంటనే రైతు కుటుంబాన్ని పరామర్శించి, రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అప్పుల సమస్య నుంచి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. శ్రీనివాసులు, సీపీఎం జిల్లా నాయకులు నాగపూర్ మధు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

