బిజినపల్లి: మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను, పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సత్యశీల, సాగర్, నరేందర్ గౌడ్, నక్క పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


