నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను బీఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ (అడ్వకేట్) మాట్లాడుతూ వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ కోట కేంద్రంగా తన సామ్రాజ్యాన్ని స్థాపించి, రజాకారులు, భూస్వాములు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి బహుజన ప్రజలకు విముక్తి కల్పించిన మహా చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. బహుజన రాజ్య స్థాపన కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
పాపన్న గౌడ్ ఆశయాలను తెలంగాణలో కొనసాగించాలంటే బహుజనులంతా ఏకమై తెలంగాణ గడ్డపై బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోనాసి భాస్కర్, బిజినపల్లి మండల అధ్యక్షుడు పానుగంటి రాంచందర్ (అడ్వకేట్), బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ, నాగర్కర్నూల్ బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మద్దెలబండ సాయిబాబు, అసెంబ్లీ కార్యదర్శి కాకునూరి మధు, బీఎస్పీ జిల్లా నాయకులు హర్ష ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


