నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు, ప్రజా నాయకుడు అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


