నాగర్‌కర్నూల్: బహుజన రాజ్యాధికార సాధన కోసం పోరాడిన యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడు, ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. తన కాలంలోనే సామాజిక సమానత్వం, ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని అన్నారు.
అణగారిన వర్గాలకు అండగా నిలిచి, పేద ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవ భావనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని, ఆయన సేవలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ, పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


