భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఉక్రెయిన్‌లోని ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్, మెటలర్జికల్ కాంప్లెక్స్‌పై రష్యా క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరు మరణించగా, 14 మంది కార్మికులు గాయపడ్డారు.
రష్యా క్షిపణి దాడి కారణంగా కర్మాగారంలోని ఇంధన వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఉక్కు ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది. మరోవైపు ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లలో 822 డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి మరోసారి ఉద్రిక్తతలను పెంచింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


