అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబం ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలపై సమగ్రంగా ఆరా తీసి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ఈ ఘటనకు ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


