అమరావతి: జనసేన ఎమ్మెల్సీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ హోదా లభించింది. ఏపీ పర్యావరణ, అటవీశాఖకు సంబంధించిన గ్రీన్ నిర్వాహక కమిటీ ఛైర్మన్గా నాగబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ కల్పించినట్లయింది. గతంలోనే నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


