తెలకపల్లి : సంతలో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో పండ్లను విక్రయిస్తున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సంతలో అరటి పండ్లను శుభ్రత లేని కార్పెట్‌పై ఉంచి విక్రయిస్తుండగా, వాటిపై ఈగలు వాలుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అపరిశుభ్రమైన ప్రదేశాల్లో పండ్లను ఉంచడం వల్ల దుమ్ము, మురికి, సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంతలో ఆహార పదార్థాల విక్రయాలపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో పండ్లు, ఇతర ఆహార పదార్థాలను విక్రయించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు కూడా పండ్లను శుభ్రమైన ప్రదేశాల్లో ఉంచి, ఈగలు వాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి, సంతలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

