బిజినపల్లి: మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలకు సంబంధించిన కిరాణా టెండర్‌ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గుంపల్లి అశోక్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం కిరాణా సరుకులు అందిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సరిపడా పప్పులు, ఇతర నిత్యావసర సరుకులు అందకపోవడంతో నాణ్యత లేని ఆహారం వండుతున్నారని తెలిపారు. కూరగాయలు కూడా నాణ్యత లేనివి, కుళ్లిపోయినవి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రి కూడా అందుబాటులో లేదని అన్నారు.
అదేవిధంగా విద్యార్థులను ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కిరాణా సరుకుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, ప్రస్తుత టెండర్‌ను రద్దు చేసి నాణ్యమైన సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బోనాసి శుభాకర్, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


