పోచమ్మ బోనాల పండుగను పురస్కరించుకుని గ్రామ ప్రజలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పోచమ్మ దేవాలయాల వద్ద ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో ఆలయ పరిసరాల్లోని చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.
ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న పోచమ్మ బోనాల పండుగకు ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు వచ్చి పండుగ ఏర్పాట్లలో భాగస్వాములు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


