పీఎం కిసాన్ యోజన 24వ విడత సాయం అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు తదుపరి విడత నగదు సాయం నిలిచిపోయే అవకాశం ఉంది.
రైతులు OTP ద్వారా ఆన్లైన్లో లేదా సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండటంతో పాటు DBT సౌకర్యం యాక్టివ్‌గా ఉండాలి.
బ్యాంకు ఖాతాలో పేరులో తేడాలు, ఆధార్ వివరాల్లో వ్యత్యాసాలు లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే నగదు జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రైతులు ముందుగానే తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


