హైదరాబాద్, ఆగస్టు 16: రైతులకు ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే ఎరువుల కోసం బుకింగ్ చేసుకునేలా నిబంధనలు అమలు చేయనుంది.
రైతుల వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి, ఎరువుల సరఫరాలో పారదర్శకత తీసుకురావడంతో పాటు అర్హులైన రైతులకు మాత్రమే ఎరువులు అందేలా ఈ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇందుకోసం ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణలో ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రీ ఆధారంగా ఎరువుల బుకింగ్ విధానం అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దీంతో రైతులు తమ వివరాలు, భూమి సంబంధిత సమాచారాన్ని ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


