చిట్వేల్, ఆగస్టు 15 (తొలి కిరణం ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చిట్వేల్ మండల కేంద్రంలో పారిశుధ్య నిర్వహణలో విశేష సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులను చిట్వేల్ సబ్ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని అన్నారు. వారి సేవలను గుర్తించి గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అనంతరం పారిశుధ్య కార్మికులకు శాలువాలు కప్పి, స్వీట్స్ బాక్సులు అందజేసి ఘనంగా సన్మానించారు. వారి సేవలను అభినందిస్తూ ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో చిట్వేల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ యంగయ్య, హెడ్ కానిస్టేబుల్ రాజు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


