నాగర్కర్నూల్ జిల్లా: మృత నెమలిని అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. లింగాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య వన్యప్రాణి నేరానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నాగర్కర్నూల్ రేంజ్ పరిధిలోని గుడిపల్లి బీట్లో మృత నెమలిని అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న మృత నెమలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తును ఎఫ్ఆర్ఓ ఎం.ఏ. సుబూర్, ఎఫ్ఎస్ఓ బి. సీత, ఎఫ్బీఓ శివాజీ చేపట్టారు.
వన్యప్రాణుల రక్షణకు సహకరించాలి:
వన్యప్రాణులను వేటాడటం, పట్టుకోవడం, తరలించడం, అక్రమంగా విక్రయించడం చట్టరీత్యా నేరమని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. వన్యప్రాణులకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేసి సంరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


