నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రెండ్ హ్యుందాయ్ షోరూమ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
నాగర్‌కర్నూల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల షోరూమ్‌లు అందుబాటులోకి రావడం ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాహన కొనుగోలుదారులకు నాణ్యమైన సేవలు అందించాలని షోరూమ్ నిర్వాహకులకు సూచించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు పాల్గొన్నారు.
కౌన్సిలర్లు అనంత అలివేలమ్మ, హర్ష, మాధవి రాజు, సునీత, హరీష్ గౌడ్, శంకర్, గౌసియా బేగం, ఇషాక్ తదితరులు హాజరై షోరూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


